నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
దేవరుప్పుల: నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఎ.అనూషకు అత్యవసర ఆపరేషన్ కోసం ముందస్తుగా రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు ఇప్పించి ఆమె భర్త మధుకు ఆదివారం అందజేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రత్యేక ఆపరేషన్‌లకు ఎల్‌ఓసీలు, సీఎం సహాయ నిధి సాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగ పురోగతికి సత్వర చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ, మండల అధ్యక్షులు రాజేష్ నాయక్, పులిగిళ్ల వెంకన్న, మాసంపెల్లి సాత్విక్, మధు, లొడంగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment