యక్షగాన కళాకారులకు పూర్వవైభవం
దేవరుప్పుల : యక్షగాన కళాకారులకు పూర్వవైభ వం తెస్తాం.. కళలకు జీవం పోసేలా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి చిన్నమడూరులో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన గడ్డం సోమరాజు కళాక్షేత్రం రెండో వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో నిలువనీడ లేని చింధు యక్షగాన కళాకారు ల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన చిందు యక్షాన, ఒగ్గు, కోలాటం, డప్పు తదితర కళాకారుల ప్రదర్శనలు తిలకించి అభినందించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మ య్య, ఉద్యమ కళాకారుడు గజవెల్లి ప్రతాప్, కళాక్షేత్రం వ్యవస్థాపకుడు గడ్డం సోమరాజు, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఉప్పల సురేష్‌బా బు, వీరారెడ్డి సోమశేఖర్‌రెడ్డి, వంగ కళమ్మ, దశర థ, నరేష్, రామచంద్రునాయక్, మాలతి, గడ్డం శేషాద్రి, శ్రీపతి, చంద్రమోహన్ పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment