చట్టాలపై అవగాహన అవసరం
జనగామ రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరికీ అవగాహ న అవసరమని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన కోమటిరెడ్డి సుశీలమ్మ రుద్రమదేవి ఓల్డేజ్ హోంను సందర్శించిన ఆయన సీనియ ర్ సిటిజన్లకు చట్టాలపై అవగాహన కల్పించారు. వారి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే కాగితంపై రాసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వయోవృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ ప్రెసిడెంట్ లక్ష్మణ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీంద్ర, పారా లీగల్ వలంటీ ర్లు శేఖర్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment