ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
జనగామ: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని చందన పిల్లల ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన వైద్యారోగ్య శాఖ నిబంధనలు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆస్పత్రుల్లో బయోమెడికల్ మేనేజ్‌మెంట్ ఒప్పందంతోపాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక శాఖ అనుమతలు అప్పనిసరి అని పేర్కొన్నా రు. ఆస్పత్రి అనుమతి పత్రాన్ని అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని, అలాగే పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పేర్ల డిస్‌ప్లేతోపాటు ప్రతి చోట హెల్ప్‌డెస్క్ ఉండాలని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది యూనిఫాం కోడ్ పాటించాలని తెలిపారు. రోగులకు మర్యాదతో కూడిన వైద్యసేవలు అందించాలని, నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అక్కడి నుంచి బస్తీ దవాఖానకు చేరుకుని వైద్యులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు
Comments
Please login to add a commentAdd a comment