ప్రజలు మోసపోయి గోసపడుతున్నరు
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయి గోసపడుతున్నరని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం యశ్వంతాపూర్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బచ్చన్నపేట, జనగామ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ విధానాలను ఎండగట్టాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, పేద కుటుంబాలు వలసపోయే పరిస్థితి నెలకొందన్నారు. రేషన్ కార్డుల పేరుతో పాలకులు ప్రజలను ఆగం చేస్తున్నారని, ప్రజాపాలనలో 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే పది శాతం పేర్లు సర్వేలో కనిపించడం లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రశ్నించడం వల్లే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామని ప్రకటించినట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వని పక్షంలో గ్రామసభల్లోనే నిలదీస్తామని హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పి.జమునలింగయ్య, ఫ్లోర్‌లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, గంగం సతీష్‌రెడ్డి, బావడ్ల కృష్ణంరాజు, మద్దికుంట రాధ, రావెల రవి, పేర్ని స్వరూప, బాల్దె కమలమ్మ, పాక రమ, వాంకుడోతు అనిత, ప్రవీణ్, నర్సింగ్, రాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment