పేదలకే మొదటి ప్రాధాన్యం
● జాబితాలో పేరుండగానే
ఇల్లు మంజూరైనట్లు కాదు
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
● లింగాలఘణపురంలో
ఇందిరమ్మ ఇళ్ల జాబితా పరిశీలన
జనగామ/లింగాలఘణపురం: సంక్షేమ పథకాల్లో నిరుపేదలు, పేదలకే మొదటి ప్రాధాన్యం కల్పిస్తాం.. జాబితాలో పేరుండగానే ఇళ్లు మంజూరైనట్లు కాదని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నా రు. ప్రజాపాలన గ్రామసభలో రైతు భరోసా, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల అర్హుల జాబితాను ప్రకటించిన సమయంలో అర్హుల పేర్లు కాకుండా అనర్హుల పేర్లు రావడంపై జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో ఆందోళనలు జరి గాయి. ఈ మేరకు ‘నిలదీతలు..నిరసనలు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. మండల కేంద్రాన్ని సందర్శించి న ఆయన గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పరిశీలించారు. అర్హుల పేర్లు ఎందుకు రాలేదని పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను అడిగారు. ప్రజాపాలన దరఖాస్తులపై సర్వే చేపట్టిన సమయంలో ఇళ్లులేని వారు స్లాబ్ ఉన్న ఇంట్లో అద్దెకు ఉండగా జాబితాలో పేరు రాలేదని.. ఆర్థికంగా ఉన్న ధనవంతుల ఇళ్ల పైకప్పులు పెంకులు, రేకులు ఉండగా ఫొటోలు అప్‌లోడ్ చేస్తే అర్హులుగా జాబితాలో వచ్చారని వివరించారు. ఈ విషయాన్ని ఇల్లు లేని ఓడపల్లి రమేశ్ కలెక్టర్‌కు విన్నవించగా.. ఇలాంటి వారు ఎందరున్నారో తిరిగి అర్హుల జాబి తాలో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్లులేని వారు స్లాబ్ ఇళ్లలో అద్దెకు ఎంత మంది ఉన్నారో పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చాలని చెప్పారు. అనర్హులుంటే జాబితా నుంచి తొలగించి కారణాలను వారికి ఫోన్ ద్వారా వివరించాలని పేర్కొన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదుకాని అర్హులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవా లని, సర్వే నిర్వహిస్తారని వివరించారు. ప్రస్తుతం ప్రకటిస్తున్న జాబితా కేవలం దరఖాస్తుదారుల ఇళ్ల స్థితిగతులను తెలుసుకోవడానికేనని, వీరందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు కాదని స్పష్టం చేశా రు. కలెక్టర్‌తో ఆర్డీఓ గోపీరాం, డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment