సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జనగామ రూరల్: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.. గ్రామ సభల్లో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్‌తో కలిసి గ్రామ సభల నిర్వహణపై జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుందని, జాబితాల్లో పేర్లు లేనివా రు గ్రామ/వార్డు సభల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ సభలకు హాజరు కాలేకపోతే ఎంపీడీఓ కార్యాలయంలోనూ దరఖాస్తు సమర్పించవచ్చని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక గ్రామాలు, వార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ సభలకు హాజరయ్యే ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని, హెల్ప్ డెస్క్‌ల ద్వారా కొత్త దరఖాస్తులు, సర్వే పరిశీలన అభ్యంతరాలను స్వీకరించాలని అన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, డిప్యూటీ సీఈఓ సరిత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీసీఎస్‌ఓ సరస్వతి, డీఏఓ రామారావునాయక్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సభల్లో ప్రతీ అంశం వివరించాలి
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment