ఆడపిల్లలు భవితకు సోపానాలు
జనగామ రూరల్: ఆడపిల్లలు భారం కాదని, భవితకు సోపానాలని తల్లిదండ్రులు వారిని సమానంగా చూడాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. మిషన్ శక్తి సామర్థ్య పోస్టర్లను ఆవిష్కరించారు. ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఆర్డీఏ వసంత, డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, డీసీపీఓ రవికాంత్, సీడీపీఓలు రమాదేవి, సత్యవతి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ రవికుమార్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు తదితరులున్నారు.
జాగ్రత్తగా ఆన్‌లైన్ చేయాలి
ప్రజాపాలన గ్రామ, వార్డు సభల అభ్యంతరాలు, దరఖాస్తులు, ఆత్మీయ భరోసా సర్వే వివరాల్ని ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మార్సీలో ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై మండల స్థాయిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాస రచన, ఉపన్యాస పోటీలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, ఎంపీడీఓ హరికృష్ణ, ఎంపీఓ సంపత్ కుమార్, తహసీల్దార్ హుస్సేన్, ఎంఈఓ రాజేందర్ తదితరులున్నారు.
రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి
జనగామ: కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఈనెల 31లోగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోని రైతులు, బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైన వారు వ్యవసాయ విస్తరణాధికారికి దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment