దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: దివ్యాంగులు సహాయ ఉపకరణా లకు ఎంపిక శిబిరాలను సద్వినియోగం చేసుకోవా లని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్ అన్నారు. మంగళవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారుల ఎంపిక శిబి రాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్ పర్యవేక్షణలో నిర్వహించిన శిబిరంలో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ఎఎల్‌ఐఎంసీఓ) అధికారులు రష్మి రంజన్‌శెట్టి, డాక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, రఘునాథపల్లి మండలాల నుంచి 60 మంది ది వ్యాంగులు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తులు చేసుకోగా స్క్రీనింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ శిబిరంలో దరఖాస్తు చేసుకున్న వారిని వారి అంగవైకల్యం ఆధారంగా అర్హులుగా ఎంపిక చేస్తారన్నారు. ఎంపికై న వారికి వీల్‌చైర్స్, ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందిస్తారన్నారు. అదేవిధంగా ఈనెల 5వ తేదీన పాలకుర్తి మండలం ముత్తారం రైతువేదిక, 6న జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం రూమ్‌నంబర్ 6లో ఎంపిక శిబిరాలను నిర్వహిస్తారని, దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలింకో కంపెనీ అధికారులు అభిషేక్, అఖిలేష్, ఐసీడీఎస్ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి రాజు, సుధాకర్, లక్ష్మీనారాయణ, ఐసీడీఎస్ సూపర్‌ౖవైజర్లు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్
ఘన్‌పూర్‌లో సహాయ ఉపకరణాలకు ఎంపిక శిబిరం
Comments
Please login to add a commentAdd a comment