ఎన్నికల నియమావళిని పాటించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13లోపు ఉపసంహరణ, 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు ఉంటాయన్నారు. అన్ని పార్టీలు ఎన్నికల నియమావళిని ఖ చ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పా రదర్శకంగా కొనసాగేందుకు జిల్లా నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పార్టీల ప్రచారా లు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్ప ష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేకంగా జిల్లా మీడియా ధృవీకరణ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా మొత్తం 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం (995) మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, వివిధ పార్టీల ప్రతినిధులు బి.భాస్కర్, జోగు ప్రకాష్, రావెల రవి, అజయ్ కుమార్, ఏ. విజయ్ భాస్కర్, ఎం. చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన ఈవీఎం గోదామును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, తహసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు.
భూ రికార్డుల డిజిటలైజేషన్ సజావుగా
నిర్వహించాలి
రఘునాథపల్లి: భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. భూ రికార్డులకు సంబంధించిన పహాణీ డిజిటలైజేషన్ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు అస్కారం లేకుండా వేగవంతంగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన రెండవ అనుబంధ ఓటరు జాబితాలో నమోదైన, నమోదు కాని ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు వాటిని ఎ లాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్ నమోదు చేయాలని సూచించారు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మోసిన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment