క్యాన్సర్‌పై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి సి విక్రమ్
జనగామ రూరల్: క్యాన్సర్‌పై ప్రతీఒక్కరికి అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ జనగామ ఆధ్వర్యంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. మంచి ఆహారం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, కాలుష్య పరిసరాలను నివారించడం, క్యాన్సర్ రోగులకు మానసిక, ఆర్థిక, సామాజిక మద్దతు అవసరమన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు అయిన శరీరంలో ఏదైన ఒక భాగంలో గడ్డలు కనిపించటం, శరీర బరువు ఆకస్మికంగా తగ్గడం, అసాధారణ రక్త స్రవం రావడం వంటి లక్షణాలను వివరించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌లను ప్రత్యేక పరీక్షలను జరిపి గుర్తిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ డి.గోపాల్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment