అతివలే పనిమంతులు
ఉపాధి హామీ పనుల్లో 65 శాతం వారే..
రాష్ట్రంలో జిల్లాకు 6వ స్థానం
ఫొటోలో ఉన్న మహిళ పేరు పుప్పాల లక్ష్మి. ఖిలాషాపురం గ్రామానికి చెందిన ఈమె ఉపాధి పథకం కింద వంద రోజుల పనిని సద్వినియోగం చేసుకుంటున్నది. పురుషులకు దీటుగా కూలీ పనులకు వెళ్తోంది. ఉదయం ఇంట్లో వంట పనులు చూసుకొని 7 గంటలకే ఉపాధి పనుల్లో నిమగ్న మవుతోంది.
పనిదినాల లక్ష్యం : 27.52 లక్షలు
పూర్తయిన పనిదినాలు : 27.30 లక్షలు
వందరోజులు పూర్తయిన కుటుంబాలు : 886
జిల్లాలో జాబ్ కార్డులు : 1,17,714
ఉపాధి పనులు చేసే కూలీలు : 2,31,024
జనగామ రూరల్: ఉపాధిలో పనుల్లో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన వారు నేడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తున్నారు. పొలం పనులతో పాటు గ్రామాల్లో ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉపాధి పనుల్లో భాగస్వాములవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment