వేరుశనగకు మద్దతు ధర ఇవ్వాలి
జనగామ రూరల్: వేరుశనగ పంట క్వింటాకు రూ. పది వేల మద్ధతు ధర ఇచ్చి మార్క్‌ఫెడ్ సెంటర్ ప్రారంభించి కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు అన్నారు. జి ల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా మద్ధతు ధర అమలు కావడం లేదన్నారు. తక్షణమే రూ.7,200 ధర అమలు చేయాలని అధికారులను కోరారు. జిల్లాలో సుమారు 1,500 బస్తాల వేరుశనగను ప్రైవేటుగా కొనుగోలు చేయడం వల్ల రైతులు భారీ ఎత్తున నష్టపోయారన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వేరుశనగ పండించిన రైతులకు మద్ధతు ధర రాకుండా చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మంగ భీరయ్య, సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర సురేష్ నాయక్, కర్రే రాములు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందు
Comments
Please login to add a commentAdd a comment