![బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/25/24jgn158-330150_mr-1737750445-0.jpg.webp?itok=SXMDmwwL)
బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
జనగామ రూరల్: బాలికలు తమ హక్కుల కోసం పోరాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు ఉన్నవారు తెలివిగా తమ సమస్యలు పరిష్కరించుకునేలా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని పథకాలను, చట్టాలను రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ఉపయోగించుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఉన్నత చదువులతో గోప్ప స్థాయిలో ఉన్నారన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని శరీరక మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య వస్తే జిల్లా న్యాయ సేవధికార సంస్థకు తెలియజేయాలని కాగితంపై సమస్య రాస్తే చాలు చర్య తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సునంద, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment