రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
జనగామ: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జనగామ ఆర్టీసీ డిపోలో డ్రైవర్స్ డే నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలతో కూడిన ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. 27 ఏళ్లుగా యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు కలిగిన ఆర్టీసీ డ్రైవర్స్ పి.గురువయ్య, ఎ.కిషన్, బి.శ్రీనివాస్‌ను సన్మానించారు. డీటీఓ శ్రీనివాస్, డిపో మేనేజర్ స్వాతి, సూపర్‌వైజర్స్, సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment