తరిగొప్పుల/నర్మెట: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనతండాలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో.. పట్టుదలతో చదివి భారత సైన్యంలో చేరారు.. తరిగొప్పుల మండలం మాన్‌సింగ్‌తండాకు చెందిన ఎనిమిది మంది యువకులు. 14 ఏళ్లుగా దేశ రక్షణలో భాగంగా వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలు స్తున్నారు. ఒకరిని చూసి ఒకరు బార్డర్ బాటపట్టారు. అందులో కాయిత సంజీవరాజు, లకావత్ మోహన్, కత్తుల శ్రీను(జమ్మూకశ్మీర్), కాయిత ప్రశాంత్(లేహ్ లడఖ్), లకావత్ రాజు(డార్జిలింగ్), కత్తుల సాంబరా జు(ఉదంపూర్), లకావత్ సంపత్(ఛత్తీస్‌గఢ్), లకావత్ లచ్చు(బిహార్) రాష్ట్రాల సరిహద్దులో సేవలందిస్తున్నారు. అలాగే నర్మెట మండలంలోని 10 మంది యువతీ యువకులు దేశరక్షణలో తమవంతు సేవలందిస్తున్నా రు. మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన డేగల సంపత్(ఛత్తీస్ గఢ్), డేగల సురేష్(బిహార్), ధరంతోష్ స్వాతి(లక్షద్వీప్), ఆగపేటకు చెందిన మతియాస్ రెడ్డి(అస్సాం), బత్తుల కృష్ణంరాజ్(తెలంగాణ), కన్నెబోయినగూడెంకు చెందిన డి.సురేందర్(ఆంధ్రప్రదేశ్), ధరావత్ శ్రీలత(తెలంగాణ), బండతండాకు చెందిన భూక్య శంకర్(తెలంగాణ), బొమ్మకూర్‌కు చెందిన ఇస్లావత్ రమేష్(ఛత్తీస్‌గఢ్)అంగోతు శ్రీనివాస్(కేరళ) ఆయా రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
తండా నుంచి సైన్యం బాట
Comments
Please login to add a commentAdd a comment