టెన్నికాయిట్ ఫెడరేషన్‌జిల్లా అధ్యక్షుడిగా విజయ్
రఘునాథపల్లి: గోవర్దనగిరి గ్రామానికి చెందిన ముసిపట్ల విజయ్ టెన్నికాయిట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టెన్నికాయిట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువుల రాజ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా కార్యవర్గం వివరాలను విజయ్ వెల్లడించారు. ఉపాధ్యక్షుడిగా లోకుంట్ల సృజన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కన్నారపు కుమారస్వామి, సహాయ కార్యదర్శి ఎడ్ల బాలరాజు, కోశాధికారి దుబ్బాక హరీశ్‌గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నునావత్ కుమార్‌నాయక్, ఇమ్మడిశెట్టి రఘురాం నియమితులైనట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment