![ఆధుని](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/26/india_mr-1737853736-0.jpg.webp?itok=F47tpXp-)
ఆధునికం.. ఆదర్శం
– 8లోu
● పలు రంగాల్లో రాణిస్తున్న జిల్లా వాసులు ● దేశ సేవకు అంకితమైన యువకులు
దేశం అభివృద్ధి చెందడమంటే.. అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి..
●
– డాక్టర్ బీఆర్.అంబేడ్కర్
ఒకప్పుడు వెనుకబాటుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సదుపాయాలతో వివిధ రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నవారు కొందరైతే.. దేశ సేవకు అంకితమైన యువకులు ఇంకొందరు ఉన్నారు. జాతీయ స్ఫూర్తిని చాటుతున్నారు మరికొందరు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలోప్రత్యేక కథనం.
లింగాలఘణపురం: ఒకప్పుడు గుడుంబా తయారీకి మారుపేరుగా ఉన్న పటేల్‌గూడెం నేడు పంటల సాగులో ప్రత్యేకతను చాటుకుంటోంది. 2వేల జనాభా.. 1,300 ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 1995 నుంచి 2014 వరకు ఎక్కువ మంది గుడుంబా తయారు చేసి ఇతర ప్రాంతా ల్లో విక్రయించే వారు. ఎకై ్సజ్ శాఖలో నిత్యం పటేల్‌గూడెం పేరు మార్మోగేది. తెలంగాణ ప్రేత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గుడుంబాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో క్రమంగా తయారీ తగ్గించి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పొగాకు పండిస్తున్నారు. అలాగే కూరగాయల్లో వంకాయ పండించి హైదరాబాద్ మార్కెట్‌లకు తరలిస్తున్నా రు. దీంతో ఒకప్పుడు గుంట భూమిలేని పేదలు నేడు భూములు కొనుగోలు చేసి 90 శాతం మంది వ్యవసాయంపై జీవిస్తున్నారు. కూరగాయలు, ఆకు కూరలు పండించి ఇతర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. పదేళ్లుగా ప్రజల్లో చాలా మా ర్పు వచ్చింది. పాడిపరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇటీవల డీఎస్సీలో కడుదూరి శ్రీకాంత్, వట్టెం సౌందర్య ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు.
మార్పు వచ్చింది..
గ్రామంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు గుడుంబా గూడెంగా ముద్రపడింది. నేడు అందరూ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. కూరగాయలతో పాటు వాణిజ్య పంట లు పండిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివిస్తున్నారు. నేను బీటెక్ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాను.
– పొన్నాల కార్తీక్, బీటెక్ విద్యార్థి
పంటల పటేల్ గూడెం
![ఆధునికం.. ఆదర్శం1](https://www.sakshi.com/gallery_images/2025/01/26/25stg154-330012_mr-1737853736-1.jpg)
ఆధునికం.. ఆదర్శం
![ఆధునికం.. ఆదర్శం2](https://www.sakshi.com/gallery_images/2025/01/26/25stg155-330012_mr-1737853736-2.jpg)
ఆధునికం.. ఆదర్శం
Comments
Please login to add a commentAdd a comment