గణతంత్ర వేడుకలకు సిద్ధం
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. కలెక్ట ర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అధికారులు ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఉదయం 8.15 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ధర్మకంచ మినీ స్టేడియంకు చేరుకుని 9 గంటలకు జెండా ఎగుర వేస్తా రు. 9.10 నుంచి 9.15 గంటల వరకు పోలీస్ గౌర వ వందనం, 9.15 నుంచి 9.25 వరకు పోలీసు పరేడ్ కార్యాక్రమం ఉంటుంది. 9.25 నుంచి 9.40 గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రసంగిస్తారు. 9.40 నుంచి 10.15 వరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్‌ను సందర్శిస్తారు. సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
నేడు నాలుగు పథకాలు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకా లను నేడు(ఆదివారం) ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున 12 గ్రామాలను ఎంపిక చేయగా.. జనగామ మండలం ఎర్రగుంటతండాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి మండలం తీగారంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. అనంతరం జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జూమ్ మీటింగ్‌లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జూమ్ మీటింగ్‌లో అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, జెడ్పీ సీఈఓ మాధురీ షా, డిప్యూటీ సీఈఓ సరిత, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. జనగామ పట్టణ పరిధిలో నిర్వహించిన వార్డు సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జనగామ మండలం ఎర్లకుంటతండా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు ప్రత్యేక, జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సంక్షేమ పథకాలకు ఎంపికై న గ్రామాలు
ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాట్లు
9 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా
జాతీయ జెండా ఆవిష్కరణ
మండలం గ్రామం బచ్చన్నపేట సాల్వాపూర్
చిల్పూరు గార్లగడ్డతండా
దేవరుప్పుల లకావత్‌తండా(టీ)
స్టేషన్‌ఘన్‌పూర్ తానేదార్‌పల్లి
జనగామ ఎర్రకుంటతండా
కొడకండ్ల నీలిబండతండా
లింగాలఘణపురం కొత్తపల్లి
నర్మెట బొమ్మకూరు
పాలకుర్తి తీగారం
రఘునాథపల్లి కన్నాయపల్లి
తరిగొప్పుల వాచ్చ్యాతండా
జఫర్‌గఢ్ అల్వార్‌బండతండా
(శంకర్‌తండా)
Comments
Please login to add a commentAdd a comment