ఓటు హక్కు అత్యంత విలువైనది
జనగామ రూరల్: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు.. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవా న్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమర్, రోహిత్‌సింగ్, డీసీపీ రాజ మహేంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతం చేశామని చెప్పారు. జిల్లాలో 7.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటరుగా నమోదు, మార్పులు, చేర్పులు ఉంటే పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్‌లు, ఎన్నికల కమిషన్ పోర్టల్, ఓటరు యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఏడాది ‘నథింగ్ లైక్ ఓటింగ్.. ఐ ఓట్ ఫర్ స్యూర్’ నినాదంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా యువత, వివిధ వర్గాల కు చెందిన ఓటర్లు ఎక్కువగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అదన పు కలెక్టర్లు, డీసీపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది శక్తిమంతమైన ఆయుధమని, ఓటు ను అమ్ముకోకుండా బాధ్యతగా వినియోగించుకో వాలని సూచించారు. అనంతరం కొత్త యువ ఓటర్లకు కార్డులు అందజేయడంతోపాటు బూత్ స్థాయి సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.సుహా సిని, ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, తహసీల్దార్ హుస్సేన్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్ పాల్గొన్నారు.
‘సౌర విద్యుత్’తో మహిళల ఆర్థికాభివృద్ధి
సౌర విద్యుత్ ఉత్పత్తితో మహిళల ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మోడల్ సౌర విద్యుత్ గ్రామాలను ఎంపిక చేసేందు కు శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఎల్‌ఆర్సీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాయని, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈఓ కన్వీనర్‌గా ఎల్డీఎం, విద్యుత్ ఎస్‌ఈ, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నా రు. ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద జిల్లా నుంచి 142 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 1.66 మెగా యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకు లబ్ధిదారులకు ఏటా రూ.49 లక్షల ఆదాయం వస్తుందని వెల్లడించారు. అలాగే మోడల్ సోలార్ విలేజ్ ఎంపికకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ‘పీఎం కుసుమ్’ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వర కు 370 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించా మని, ఇందులో 12 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించి నట్లు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మాధురీ షా, ఎల్డీఎం శ్రీధర్, విద్యుత్ ఎస్‌ఈ వేణుమాదవ్, తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Comments
Please login to add a commentAdd a comment