సాద్విన్‌రెడ్డికి అభినందనలు
స్టేషన్‌ఘన్‌పూర్: ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించిన మ్యాథ్స్ బీ (2024–25) రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ఘన్‌పూర్‌కు చెందిన ఒయాసిస్ హైస్కూల్ విద్యార్థి పి.సాద్విన్‌రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈనెల 24న హైదరాబాద్ రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సాక్షి యాజ మాన్యం నుంచి సాద్విన్‌రెడ్డి రూ.5వేల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాఠశాలలో యాజమాన్యం అతడిని అభినందించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.సతీష్‌రెడ్డి మాట్లాడు తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వివిధ పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడానికి ‘సాక్షి’ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కమలాకర్, శ్రీలత, స్వాతి, పద్మజ, ఫాతిమా, అర్చన, షకీరా, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో వైద్యులు
అందుబాటులో ఉండాలి
బచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందివచాలని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్‌రావు అన్నారు. శనివారం స్థానిక ఆస్పత్రిని సందర్శించిన ఆయన మాట్లాడుతూ సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ఈ మేరకు ఏఎన్‌ఎంలు, ఆశ వర్క ర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పా రు. అలాగే పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ బృంద సభ్యులు వచ్చి ఆలింపూర్ సబ్ సెంటర్, బచ్చన్నపేట ఆస్పత్రులను పరిశీలించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు శ్రీనివాస్, అరుణ, దీప్తి, పీహెచ్‌ఎన్ అన్నాంబిక, సీహెచ్‌ఓ జంగమ్మ, హెడ్ నర్సు లక్ష్మి, జాస్మిన్, ఫార్మసిస్ట్ బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు కల్పించిందే అంబేడ్కర్..
జనగామ రూరల్: ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిందే అంబేడ్కర్ అని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్, జిల్లా ఉద్యమకారుల ఆధ్వర్యాన మంగళంపల్లి రాజు అధ్యక్షతన ఓటుహక్కుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఓటు వేయడానికి అంబేడ్కర్ కారణమని పేర్కొన్నా రు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉద్యమకారులు తిప్పారపు విజయ్, పానుగంటి ప్రవీణ్, నల్ల రాహుల్, వేంపటి అజయ్, సల్ల మహేష్, యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment