జఫర్‌గఢ్ : దేశ విముక్తి కోసం తన తండ్రి చేసిన పోరాటాన్ని, జెండా వందనాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జఫర్‌గఢ్‌కు చెందిన బైరి వెంకటేశ్వర్లు. కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా పంద్రాగస్టుతో పాటు గణతంత్ర దినోత్సవం రోజు వేడుకలు నిర్వహిస్తున్నాడు. జాతీయ జెండా ఎగురవేస్తూ దేశం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుతున్నాడు. ఆయ న తండ్రి బైరి సత్తయ్య దేశ స్వాతంత్య్రం కోసం పని చేయడంతో పాటు 1958లో మండల కేంద్రం ప్రధాన కూడలి వద్ద జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
అప్పట్లో ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించింది. ఇప్పటికీ ఆ కూడలిని గాంధీ సెంటర్‌గా పిలుస్తుంటారు. వెంకటేశ్వర్లు తన తండ్రి మర ణం తర్వాత శిథిలావస్థకు చేరుకున్న గాంధీ విగ్రహాన్ని సొంత ఖర్చుతో తిరిగి నిర్మించి గాంధీ జయంతి రోజున వేడుకలు నిర్వహిస్తున్నాడు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న వెంకటేశ్వ ర్లు.. మహాత్మాగాంఽధీ సేవా సమితి పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అవార్డుల లావణ్య
చిల్పూరు: గృహిణిగా.. గ్రామ మహిళా సంఘంలో సభ్యురాలి గా చురుగ్గా వ్యవహరిస్తున్న మల్కాపూర్ గ్రామానికి చెందిన బోగం లావణ్య.. ప్రవృత్తిగా ఎంచుకున్న బ్యూటీషియన్‌లో ప్రత్యేకతలతో ప్రశంసలతో పాటు సౌత్ ఇండియన్ మేకోవర్ అవార్డు సైతం ఎంపికయ్యారు. 2014లో మహిళా సంఘం గ్రూపులో సభ్యురాలిగా చేరినప్పటి నుంచి సభ్యులతో కలిసి చిన్నచిన్న పనులు నేర్చుకునేది.
సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఐకేపీలో బుక్ కీపర్‌గా ఉండేది. ఆ సమయంలో ఇంటర్ నేషనల్ బ్యూటీషియన్ ప్రత్యూష వద్ద శిక్షణ పూర్తి చేసుకుంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించాలనే ధ్యేయంతో స్వగ్రామంలోనే బ్యూటీషియన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంది. శుభకార్యాలకు బ్యూటీషియన్ పనులు అవసరమైతే వెళ్లి వారికి నచ్చేలా తీర్చిదిద్దేది. లావణ్య ప్రతిభను గుర్తించి న సీమ సంస్థ ఫౌండర్ ముఖేష్ సౌత్ ఇండియా మేకోవర్ అవార్డు ప్రకటించారు.
మల్కాపూర్ పాఠశాలలో జరిగిన ఓ కార్యకమ్రంలో పిల్లలకు వేసిన మేకప్‌ను పరిశీలించిన భద్రాచలానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అక్కడి కలెక్టర్ శ్రీనివాస్‌కు వివరించగా ఆయన చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ఐదు నెలల క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో నటులకు వివిధ రకాల మేకప్ వేయడంతో నటుడు సంతోషిసర్కార్ తన పేర మేకప్ ఉత్తమ అవార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment