సాగుకు ‘డ్రోన్’ సేవలు
రఘునాథపల్లి: వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. సులువుగా పని పూర్తయ్యేలా.. కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పూర్వీకులు చీడ పీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు చేతి పంపులు వాడేవారు. ఐదారేళ్లుగా రైతులు చార్జింగ్ పంపులు, పెట్రోల్ పంపులు వినియోగిస్తున్నారు. సుమారు 20 లీటర్ల బరువు కలిగిన పంపులను మోస్తూ పిచికారీ చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో మాదిరిగా కూలీలు అందుబాటులో లేక డ్రోన్లను వినియోగిస్తున్నారు. 10 నిముషాల్లోనే ఎకరం పొలం పిచికారీ చేసే 10 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్‌ల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నా రు. పొలంలోకి దిగకుండానే.. గట్టుమీది నుంచి రిమోట్ ద్వారా డ్రోన్‌తో సులువుగా మందు స్ప్రే చేస్తున్నారు. డ్రోన్లు కొనుగోలు చేసిన రైతులు.. సొంత పొలాలకు మందు పిచికారీ చేసుకోవడంతో పాటు ఇతర రైతుల పంటలకు ఎకరాకు రూ.500 తీసుకుని స్ప్రే చేసి ఉపాధి పొందుతున్నారు. డ్రోన్ వ్యవసాయంతో సమయం, ఖర్చు ఆదా అవుతున్నదని మండల కేంద్రానికి చెందిన రైతు నీలం వాసు పేర్కొన్నారు. డ్రోన్‌తో వరి, మామిడి, జామ, మిర్చి తదితర పంటలకు రోజు 20 నుంచి 30 ఎకరాల వరకు సులువుగా మందు స్ప్రే చేయవచ్చని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment