గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న రాజ్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో ఎన్ని కుట్రలు చేసినా ఏఐటీయూసీ గెలుపు ఖాయమని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గని ఫీట్ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌కు రాజ్‌కుమార్ హాజరై మాట్లాడారు. కార్మికుల అండదండలతో ఏఐటీయూసీ బలంగా ఉందన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం సర్కార్ సంఘాలతో సాధ్యం కాదన్నారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాడేది తామేనని చెప్పారు. సింగరేణిలో ఎన్నికలు ఆపడానికి ఇతర సంఘాలు ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. కోర్టులపై కమ్యూనిస్టులకు అపార నమ్మకం ఉందని స్పష్టంచేశారు. అనేక కుట్రలు చేసినా హైకోర్టు మొట్టికాయలు వేసి ఈనెల 27న ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోటపలుకుల రమేష్, మాతంగి రామచందర్, శ్రీనివాస్, విజేందర్, చంద్రమౌళి, ఆసిఫ్‌పాషా, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment