గుబులు రేపుతున్న ఎర్రజెండాలు
● చిన్న కాళేశ్వరం పనులతో
ఆందోళనలో రైతులు
కాళేశ్వరం: మొన్న ఎలికేశ్వరం, నేడు రాపల్లికోట రైతులు చిన్న కాళేశ్వరం పనులతో ఆందోన చెందుతున్నారు. తమకు సమాచారం లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేచేసి తమ చేతికొచ్చిన పత్తి చేన్లలో ఎర్ర జెండాలు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో చిన్నకాళేశ్వరం కెనాల్‌లో మొత్తం 60 ఎకరాల వరకు గతంలో అధికారులు సర్వే చేసి భూమికి డబ్బులు చెల్లించినట్లు పేర్కొంటున్నారు. కానీ రైతులు మాత్రం తమకు పరిహారం అందలేదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సూరారం వద్ద రెండు రోజుల కిందట పత్తిచేనులో ట్రెంచ్ తవ్వకాలు జరిపారని రైతులు తెలిపారు. అధికారులు పంట పూర్తయిన తరువాతనే తమకు పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరతున్నారు. లేనిపక్షంలో పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment