క్రీడలతో మానసికోల్లాసం
రేగొండ: క్రీడలు మానసికోసంతో పాటు శారీరక ధృఢత్వాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి, కనిపర్తి గ్రామాలలో నిర్వహించిన టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, జిల్లా, మండల నాయకులు నాయిని సంపత్‌రావు, పున్నం రవి, నిమ్మల విజేందర్, రమణారెడ్డి, రొంటాల వెంకటస్వామి, వీరబ్రహ్మం, షాబీర్ అలీ, తిరుపతి పాల్గొన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
భూపాలపల్లి రూరల్: సంక్రాంతి పండుగ అందరి కుటుంబాల్లో భోగభాగ్యాలు నింపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 26 నుంచి రైతు భరోసాతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment