వైభవంగా గోదారంగనాథుల కల్యాణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీరామాలయంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ కల్యాణ మండపంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తిశర్మ, రామాచారిడ ఆధ్వర్యంలో గోదాదేవి– రంగనాయక స్వామి వార్ల కల్యాణం సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. సోమవారం వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ ఉత్సవమూర్తుల కల్యాణ తంతును బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కల్యాణ దాతలకు అర్చక స్వాములు ఆశీర్వచనం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు వసంత, మాధవి, కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది, పాల్గొన్నారు. మహదేవపూర్‌లోని మందరగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవీణ్‌చార్యుల ఆధ్వర్యంలో గోదారంగనాయక కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఎలికేశ్వరం గ్రామంలోని సీతారామచంద్రస్వామివారి ఆలయంలో గోదారంగనాథుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా స్వామివారి శిష్యులు వరుణ్‌చార్యులు, ప్రణయ్, సుప్రతిక్చార్యుల ఆధ్వర్యంలో జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment