గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి వద్ద హారతి కార్యక్రమాన్ని అర్చకులు, వేదపండితులు ఘనంగా ని ర్వహించారు. సోమవారం కాళేశ్వరం దేవస్థానం నుంచి కాలినడకన గోదావరికి చేరుకున్నారు. అనంతరం గోదావరిమాతకు పూలు, పండ్లు, పా లు, పసుపు, కుంకుమ, వస్త్రాలతో సారె, నైవేద్యాన్ని సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఆధ్వర్యంలో హారతి తంతును చేశారు. ఈకార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకు బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment