మానుకోట.. కాంగ్రెస్‌ కంచుకోట | Sakshi
Sakshi News home page

మానుకోట.. కాంగ్రెస్‌ కంచుకోట

Published Sat, Apr 20 2024 1:55 AM

 సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, హాజరైన కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు - Sakshi

జన జాతర సభలో జోష్‌ నింపిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం

ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా..

గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఉంటాయి. ఇరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, మహబూబాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్‌ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్‌ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్‌ నింపుతూ సాగింది. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్‌ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్‌ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్‌ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్‌లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలు, కేసీఆర్‌ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్‌ఎస్‌ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది.

జోష్‌ నింపుతూ ప్రసంగం

ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్‌ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్‌ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది.

మంత్రులు ఏమన్నారంటే..

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు

కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ

మాట్లాడిన మంత్రులు

చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్‌

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

మానుకోటలో రెండో రోజు నాలుగు,

వరంగల్‌లో మూడు నామినేషన్లు

సీఎం పర్యటన ఇలా..

3.12 గంటలకు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంతి

5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం

5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం

6.17 గంటలకు ప్రసంగం ముగిసింది

6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు

6.25 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లారు.

8లోu

1/4

ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
2/4

ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

3/4

4/4

Advertisement
Advertisement