వెలగని సెంట్రల్‌ లైటింగ్‌ | Sakshi
Sakshi News home page

వెలగని సెంట్రల్‌ లైటింగ్‌

Published Sat, Apr 20 2024 1:55 AM

జిల్లాకేంద్రంలో జాతీయ రహదారిపై వెలగని లైట్లు 
 - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. హనుమాన్‌ దేవాలయం నుంచి గణపురం మండలం చెల్పూర్‌ వరకు 10 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైట్లలో కొన్ని లైట్లు పనిచేయడం లేదు. చెడిపోయిన లైట్లకు మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో సైతం లైట్లు వెలగకపోవడంలో చీకట్లు అలుముకుంటున్నాయి. మున్సిపాలిటీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

1/1

Advertisement
Advertisement