అంబరాన్నంటిన ‘నూతన’ సంబురాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 2025 నూత న సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారు జామున మహిళలు, చిన్నారులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి న్యూ ఇయర్‌కు ఘన స్వాగతం పలికారు. ఇళ్లలో కుటుంబసభ్యులు కలిసి కేక్‌లు కట్ చేసుకున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు,ప్రార్థఽనలు నిర్వహించారు.
కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక, అర్చన పూజలు నిర్వహించారు. శుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ పరిసరాలు, గోదావరి తీరంలో భక్తులతో కిక్కిరిసింది.
ఇళ్ల ఎదుట రంగవల్లులు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment