రెండు, మూడు పీరియడ్లు వాటికే..
పాఠశాలలో ప్రతిరోజూ ఏడు పీరియడ్లు ఉంటుండగా.. కనీసం 2, 3 పీరియడ్ల సమయం రికార్డుల నమోదుకే పోతోంది. మిగిలిన వాటిలో రెండు లేదా మూడు క్లాసులకు, కల్చరల్‌కు పోతాయి. దీంతో విద్యార్థులకు పాఠాలు ఎప్పుడు చెప్పేదని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రా రంభించే కార్యక్రమాలకు, స్వచ్ఛత వంటి కార్యక్రమాలకు ర్యాలీలు తీయడంతోపా టు దగ్గరుండి వాటిని పర్యవేక్షించాల్సిన ప రిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించే సమావేశాలకు, శిక్షణ తరగతులకు టీచర్లు హాజరు కావా ల్సి ఉంటుందని, ఇలా బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ కావడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఎంఈ ఓలు, డీఈఓల పదోన్నతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హెచ్‌ఎంలకే అదనపు బాధ్యతలు అప్పగించా రు. దీంతో రెండు బాధ్యతలను నిర్వర్తించలేక వారు కూడా ఇబ్బంది పడుతున్నారు.
● ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత వారిపైనే..
● తొలిమెట్టు, ఉన్నతి,
ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏలతో ఇబ్బందులు
● మధ్యాహ్న భోజనం, పరీక్షలు, హాజరు నమోదు నివేదికలతో సతమతం
● విద్యాబోధనకు దొరకని సమయం
భూపాలపల్లి అర్బన్: పాఠశాల సమయంలో.. ఏ టీచర్‌నైనా ఏం చేస్తున్నారు? అని అడిగితే వారి నుంచి మొదటగా ’రికార్డులు రాస్తున్నా’ అనే సమాధానమే వస్తోంది. క్లాసులో ఉన్నాననో, పాఠాలు చెబుతున్నాననో చెప్పాల్సిన ఉపాధ్యాయులు రికార్డులతో వేగలేక, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు సమయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీసీఈ విధానంలో తొలిమెట్టు, ఉన్నతి, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ), అమ్మ ఆదర్శ పాఠశాల వంటి కార్యక్రమాలు వీరికి తలకు మించిన భారంగా మారాయి. దీనికితోడు నాలుగేళ్ల క్రితం స్కావెంజర్లు, స్వీపర్లను తొలగించి ఈ ఏడాది మళ్లీ నియమించారు. పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
సుమారు 20 రికార్డులు..
ప్రభుత్వ బడుల్లో రికార్డుల నమోదుకు రికార్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో ఆ బాధ్యతను ఉపాధ్యాయులే మో యాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనం లెక్కలు ఆన్‌లైన్‌లో, పరీక్షల మార్కులు, విద్యార్థుల హాజరు, సా మర్థ్యాలు ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు నివేదిక తయారు చేయాలి. వాటిని ప్రతి నెలా ఉన్నతాధికారులకు పంపించాలి. ఇలా ప్రతీ స్కూల్లో సుమారు 20 వరకు రికార్డులు రాయాల్సి ఉంటుంది. అలాగే, తమ క్లాసులోని విద్యార్థులకు సంబంధించిన, సబ్జెక్టుల వారీగా కూడా వివరాలు నమోదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment