కనీస వేతనం ఇవ్వాలి
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26వేలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సీనియర్ నాయకులు బండారి బాబు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకోవడం తగదన్నారు. సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరారు. 8గంటల పనివిధానాన్ని అమలుచేసి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, 11వ పీఅర్‌సీని ప్రకటించాలని, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని కోరారు. అర్హత కలిగిన వారికి పదోన్నతులు ఇవ్వాలని, ప్రతీ నెల వేతనాలు చెల్లించాలని కోరారు. నేడు (సోమవారం) కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బుచ్చయ్య, సురేందర్, రమేష్, శ్రీనివాస్, రవి, సారయ్య, రమేష్, సురేష్, దేవమ్మ, రాధ, స్వరూప, పద్మ, సరోజన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment