రహదారి భద్రత సమష్టి బాధ్యత
గణపురం: రహదారి భద్రత సమష్టి బాధ్యత అని జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం గణపురం మండలంలో చెల్పూరులో రోడ్డుపై ప్రయాణించే ఆటో డ్రైవర్లు, మోటర్ వెహికిల్‌పై ప్రయాణించే వారికి రోడ్డు ప్రయాణ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి సమష్టి బాధ్యత అని.. ఇందులో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. మోటర్ సైకిల్‌పై ప్రయాణించే ప్రతీ ఒక్కరు తప్పకుండా హెల్మెంట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దన్నారు. అతి వేగంతో వాహనాలు నడుపరాదని సూచించారు. ప్రతీ వాహనానికి అన్ని పత్రాలు కలిగి ఉండాలని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దన్నారు. ప్రమాదం అనేది హఠాత్తుగా వచ్చే పరిణామమని.. ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయని అందుకు గల కారణాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని
Comments
Please login to add a commentAdd a comment