అద్దె చెల్లించి ఖాళీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

అద్దె చెల్లించి ఖాళీ చేయాలి

Published Wed, Jan 8 2025 1:27 AM | Last Updated on Wed, Jan 8 2025 1:27 AM

అద్దె చెల్లించి ఖాళీ చేయాలి

అద్దె చెల్లించి ఖాళీ చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను సింగరేణి భవనంలోకి తరలిస్తుండగా అద్దె చెల్లించి ఖాళీ చేయాలని భవన యాజమాని నాగుల దేవేందర్‌రెడ్డి మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 సంవత్సరంలో జిల్లా మైనారిటీ శాఖ అధికారి 2027వ సంవత్సరం వరకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు.. రాజకీయ కక్షతో ఖాళీ చేయిస్తున్నారు.. ఏడాది కాలంగా అద్దె చెల్లించలేదు.. సుమారు రూ.40లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. పెండింగ్‌ అద్దె విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌, జిల్లా మైనారిటీశాఖ అధికారి, కార్యదర్శికి రాత పూర్వకంగా వినతులు ఇచ్చినా స్పందన లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవన యాజమాని కుటుంబ సభ్యులతో కలిసి సామగ్రి తరలింపును అడ్డుకోగా అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విడతల వారీగా అద్దె చెల్లిస్తామని, బకాయి గురించి శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఇన్‌చార్జ్‌ డీఎండబ్ల్యూఓ శైలజ తెలిపారు.

గురుకులం తరలింపును అడ్డుకున్న

భవన యజమాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement