ఎక్స్‌ట్రా బకెట్ దందా!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పరిధి పలుగుల ఇసుక క్వారీల్లో ఎక్స్‌ట్రా బకెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. సంబంధిత టీజీఎండీసీ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిబంధనలు తుంగలో తొక్కి రెండు నుంచి మూడు బకెట్లు అదనంగా(ఎక్స్‌ట్రా) వేస్తూ రూ.2వేల నుంచి 4వేల వరకు లారీ డ్రైవర్ల వద్ద వసూలు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పలుగుల క్వారీలో ఈ దందా అధికంగా సాగుతోంది. సంబఽంధిత ఉద్యోగులకు తెలిసే అంతా జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత అధికారులు ఓవర్‌లోడుతో తరలిపోతున్నా చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత పీఓ శ్రీరాములును సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment