కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో ఽశివరాత్రికి ముందు మూడు రోజుల పాటు కుంభాభిషేకం నిర్వహించడానికి దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ నిర్ణయించినట్లు ఈఓ మారుతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయంలో కాళేశ్వరం దేవస్థానం అధికారులు, అర్చకులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరాలయంలో ఫిబ్రవరిలో శివరాత్రి, మే నెల 15నుంచి సరస్వతి నదికి పుష్కరాలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో శృంగేరి పీఠాధిపతి లేదా వారి శిష్య బృందం 50మంది వేదపండితులతో కుంభాభిషేకాన్ని మూడు రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంబంధితశాఖ మంత్రి కొండా సురేఖ, మంథని శాసనసభ్యులు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో చర్చించి కుంభాభిషేకం నిర్వహించు తేదీలను ప్రకటించనున్నారు. దేవస్థానం అధికారులు ఫిబ్రవరి 7, 8, 9, 17 తేదీలను కుంభాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ తేదీల్లో ఒక తేదీ కోసం మంత్రుల అనుమతి తీసుకోనున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment