పెరగనున్న వరిసాగు..
ఈ యాసంగిలో మొక్కజొన్న, వరిసాగుపైనే రైతులు దృష్టి సారించారు. పత్తి పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో నెల రోజుల క్రితమే మొక్కలను తొలగించి దుక్కులు దున్ని పత్తి స్థానంలో మొక్కజొన్న సాగును ప్రారంభించారు. మొక్కజొన్నలు ప్రస్తుతం ధర పలుకుతుండటంతో ఈ యాసంగి నష్టాలను తీర్చుకోవచ్చని భావిస్తున్నారు. గత యాసంగిలో వరిపంట 82వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 92,500 ఎకరాల్లో సాగు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500బోనస్ ఇస్తుండటం, బహిరంగ మార్కెట్‌లో ధర పలుకుతుండటంతో రైతులు ఈసారి 10,500 ఎకరాల్లో అధికంగా సాగు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే నార్లు పోయగా త్వరలోనే వరినాట్లు వేయనున్నారు. గణపసముద్రం, భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌లతో పాటు మానేరు వాగు కింద భూముల్లో ఇప్పటికే వరినార్లు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment