నిండా ముంచుతున్న దళారులు
కాటారం: ఆరుగాలం శ్రమించి పత్తి సాగు చేసిన రైతులను దళారులు నిండా ముంచుతూ అడ్డగోలు ధరతో నిలువు దోపిడీ చేస్తున్నారని భారత ఐఖ్య యువజన సమాఖ్య(యువైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుయాదవ్ ఆరోపించారు. మండలంలోని పలు గ్రామాల్లో దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేసి తరలిస్తున్న వాహనాలను ఆదివారం బాపుయాదవ్ అడ్డుకున్నారు. అనంతరం బాపుయాదవ్ మాట్లాడుతూ దళారులు రైతుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకొని క్వింటాల్‌కు రూ.5800 నుంచి రూ.6,200 వరకు మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్, వ్యవసాయ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బాపుయాదవ్ వెంట తుడుందెబ్బ నాయకుడు దయ్యం పోచయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment