జనగామ: పక్షులు మానవుడికి జీవన గమనం నేర్పుతాయి. వాటిని కాపాడడం మన కర్తవ్యం. వీటిని వ్యవసాయానికి సహజమిత్రులుగా భావిస్తాం. చనిపోయిన చిన్న జీవుల అవశేషాలను తినడం ద్వారా పక్షులు (గద్దలు, రాబందులు) వ్యాపించే రోగాలను తగ్గిస్తాయి. ఇవి పర్యావరణానికి అందాన్ని జోడించి పర్యాటకులను ఆకర్షించి ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. కానీ, అడవులను నరికి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు, ఆహారం కోసం వీటిని వేటాడుతున్నారు. పక్షులను రక్షించడం ప్రకృతికి మేలు చేయడం మాత్రమే కాదు. మన భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించడం.
– తుమ్మ కమలహాసన్, జీవశాస్త్ర విషయ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment