రీ నోటిఫికేషన్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పాలకమండలి నియామకానికి రీ నోటిఫికేసన్‌కు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం ఈఓ ఏ.మారుతి రీనోటిఫికేషన్ సోమవారం (నేడు) వేయనున్నట్లు తెలిపారు. నేటినుంచి 20 రోజుల పాటు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
గతేడాది మార్చిలో..
కాళేశ్వరం దేవస్థానం పాలకమండలి గడువు గతేడాది మార్చి 14న ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఆగస్టు 30న పాలకమండలి నియామకానికి నోటిఫికేషన్ వెలుబడింది. సెప్టెంబర్ 20 వరకు 20రోజుల గడువులోపు సుమారుగా మహదేవపూర్, కాటారం, భూపాలపల్లి మండలాలకు చెందిన 37మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆశావహులు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనివార్య కారణాలతో మూడు నెలల గడువు తరువాత ఆ నోటిఫికేషన్ రద్దు చేశారు. దీంతో మళ్లీ పాలకమండలికి నోటిఫికేషన్ వేశారు. దీంతో ఫిబ్రవరి 26న మహా శివరాత్రి, మే నెలలో జరిగే సరస్వతి నది పుష్కరాలకు పూర్తిస్థాయిలో పా లకమండలి నియామకం జరుగుతుందని ఆశావహుకులు, అధికారులు పేర్కొంటున్నారు.
ఆశలు గల్లంతు
గతేడాది ఆగస్టులో వేసిన నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకొని చైర్మన్, డైరెక్టర్‌ల రేసులో ఉన్న వారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందని డైలమాలో పడ్డారు. మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలిసింది. కాళేశ్వరం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. త్వరలో 6ఏ ఆలయాల నుంచి ఏసీ (అసిస్టెంట్ కమిషనర్)హోదా ఆలయానికి వెళ్లనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆలయ హోదాకు తగ్గట్టుగా రాష్ట్రస్థాయి నుంచి కూడా చైర్మన్, డైరెక్టర్‌ల రేసులో దరఖాస్తులు రానున్నాయని ప్రచారం జరగుతుంది. దీంతో ఆలయం అభివృద్ధిపై ఆశలు పెరుగుతున్నాయి.
కాళేశ్వరం దేవస్థానం
పాలకమండలికి ఉత్తర్వులు
నేటి నుంచి ఈనెల 26వరకు
దరఖాస్తుల స్వీకరణ
ఆశావహుల ఆశలు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment