సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్ ద్వారా ఇటీవల ఆరుగురు జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ల (జేఈఓ)లను నియమించారు. గ్రేడ్–1 ఉద్యోగులైన వీరికి వివిధ ఏరియాల్లో పోస్టింగ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్యులు జారీ అయ్యాయి. ఇందులో వాసం దీపక్‌ను భూపాలపల్లి జేఈఈఓగా, నేరెళ్ల మహేష్‌గౌడ్‌ను శ్రీరాంపూర్ ఏరియాకు, మారేడు మధుమితను కొత్తగూడెం ఏరియాకు, నేరెళ్ల నీరేష్‌గౌడ్‌ను ఆర్జీ–1 ఏరియాకు, భూక్యా రజనీకాంత్‌ను బెల్లంపల్లికి, ఆసిఫ్ మహ్మద్‌ను మందమర్రి ఏరియా జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్‌గా కేటాయించారు.
8మంది అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి పరిధిలోని వివిధ ఏరియాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం ఏరియా జేవీఆర్ ఓసీ–2 ఎస్‌ఓఎం పి.నర్సింహారావును మణుగూరులోని కేపీయూజీ గనికి, మణుగూరు ఓసీ సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ బెజ్జంకి రాజేశ్వరరావును కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ ఓసీ–2కి, మణుగూరు కేపీయూజీ గని అడిషనల్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లును మణుగూరు ఓసీకి, భూపాలపల్లి ఏరియా కేటీకే–1 ఇంక్‌లైన్ గని అడిషినల్ మేనేజర్ ఎం.జాన్సన్‌ను ఆర్జీ–1 లోని జీడీకే–11 ఇంక్‌లైన్ గనికి బదిలీ చేశారు. ఆర్జీ–1లోని జీడీకే–11 ఇంక్‌లైన్ అడిషనల్ మేనేజర్ జి.మహేష్‌ను ఆర్జీ–3 ఏరియా ఓసీ–2కి, ఆర్జీ–1లోని జీడీకే–11 ఇంక్‌లైన్ అడిషనల్ మేనేజర్ రావూరి చంద్రశేఖర్‌రావును భూపాలపల్లిలోని కేటీకే–8 ఇంక్‌లైన్ గనికి, కొత్తగూడెం జేవీఆర్ ఓసీ అడిషినల్ మేనేజర్ గౌతం రాజేష్‌రెడ్డిని బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీకి, మణుగూరు పీకే ఓసీలో ఎస్‌ఈ(ఎస్‌ఎంఎంసీ) వి.నాగరమేష్‌ను మణుగూరులోని క్వాలిటీ మేనేజ్‌మెంట్ విభాగానికి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment