75రోజులు.. 22.49లక్షల టన్నులు.. | - | Sakshi
Sakshi News home page

75రోజులు.. 22.49లక్షల టన్నులు..

Published Sat, Jan 4 2025 8:37 AM | Last Updated on Sat, Jan 4 2025 8:37 AM

75రోజ

75రోజులు.. 22.49లక్షల టన్నులు..

భూపాలపల్లి అర్బన్‌: 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు సింగరేణి యాజమాన్యం 49.60లక్షల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని విధించింది. మూడు నెలల కాలంలో ఇంకా 22.49లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించించాల్సి ఉంది. ఇప్పటికే సింగరేణి సంస్థ ఏరియాలో నష్టాల్లో నడుస్తుంది. సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినట్లయితే నష్టాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలపై శుక్రవారం ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డిసెంబర్‌ మాసంలో 5.42లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 4.02లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీసి 74శాతంలో నిలిచినట్లు వివరించారు.

9 నెలల్లో 24,10,346 టన్నుల

బొగ్గు వెలికితీత

ఏరియాలోని నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్‌కాస్ట్‌లలో గడిచిన తొమ్మిది నెలల కాలంలో 32,73,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 24,10,346 టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగించడానికి ఇంకా మూడు నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన ఉత్పత్తి చేయడానికి రోజుకు 16వేల టన్నుల ఉత్పత్తి వెలికి తీసినట్లయితేనే యాజమాన్యం నిర్దేశించిన లక్షాన్ని అధిగమించనున్నారు. ప్రస్తుతం సరిసరిగా 8,700 టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.

రూ.267కోట్ల నష్టాలు

భూపాలపల్లి ఏరియా గడిచిన తొమ్మిది నెలల్లో చేసిన బొగ్గు ఉత్పత్తికి రూ.1,153కోట్ల ఖర్చు కాగా వెలికి తీసిన బొగ్గుకి రూ.285కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో సుమారుగా రూ.267 కోట్ల నష్టాలను చవిచూసింది. గత ఏడాదితో పోలిేస్తే ఈ ఏడాది నష్టాలు రూ.8కోట్ల మేరకు తగ్గాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్‌ వరకు రూ.275కోట్ల నష్టాలు ఉండేవి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. మిగిలిన మూడు నెలల కాలంలో కనీసం 15లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన ఏరియాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి నష్టాలు తగ్గిపోయి లాభాలవైపు నిలుస్తుంది.

ఉత్పత్తిలో ముందుకు తీసుకువెళ్తాం..

భూపాలపల్లి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి ఉంది. ఇక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ సమస్యలను అధిగమిస్తూ ఏరియాలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతాం. భూగర్భ గనుల్లో ఇసుక కొరతను అధిగమించేందుకు కేటీపీపీ నుంచి బూడిద రవాణా చేసేందుకు టెండర్ల ప్రక్రియలో ఉంది. ఓసీ–2లో మరో కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఓసీపీలో మట్టి వెలికితీతకు మరో నూతన కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేస్తాం. కార్మికుల హాజరుశాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఓపెన్‌కాస్ట్‌ 2, 3ప్రాజెక్ట్‌ ప్రభావిత గ్రామాలైన గాడ్డిగానిపల్లి గ్రామ భూనిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నాం. కొండంపల్లి భూనిర్వాసితులకు రూ.123కోట్లు కలెక్టర్‌ ఖాతాలో జమ చేస్తాం. ఏరియాలోని భూగర్భ గనుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల రక్షణకు సంబంధించి రెన్క్యూ శిక్షణ ఇస్తున్నాం.

– రాజేశ్వర్‌రెడ్డి, ఏరియా జీఎం

ఏరియా ఉత్పత్తి లక్ష్యం

49.60లక్షల టన్నులు

గడిచిన 9 నెలల్లో 24.10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

9 నెలల్లో రూ.267కోట్ల నష్టాలు

విలేకరుల సమావేశంలో

ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
75రోజులు.. 22.49లక్షల టన్నులు..1
1/1

75రోజులు.. 22.49లక్షల టన్నులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement