ఏఐటీయూసీ కృషితోనే వయోపరిమితి పెంపు
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి పెంపు ఘనత ఏఐటీయూసీదే అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి (ఏఐటీయూసీ) కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఏరియాలోని కేటీకే ఓసీ–3లో శుక్రవారం ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ శంకర్ అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన అనతి కాలంలోనే పలు డిమాండ్లను సాధించినట్లు తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35నుంచి 40సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు. టెక్నీషియన్లు, మైనింగ్ సూపర్‌వైజర్లకు సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వడం, గతంలో మైనింగ్ సర్టిఫికెట్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగాలు పోయిన జేఎంఈటీలకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచీ సెక్రటరీ మధు, విజేందర్, కృష్ణ, శ్రీకాంత్, శ్రీనివాస్, మహేందర్, వెంకటస్వామి, అజయ్, హరీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment