కోటగుళ్లు, గణపసముద్రం అభివృద్ధికి ప్రణాళికలు
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లు(గణపేశ్వరాలయం), గణపసముద్రం చెరువులను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించాలని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అదికారులను ఆదేశించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, పర్యాటక శాఖ ఎండీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి సోమవారం కోటగుళ్లు, గణపసముద్రం చెరువును ఆమె పరిశీలించారు. ఆలయ విశిష్టత, ఆలయ భూముల వివరాలను ఆమె పురవాస్తు శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రకియ పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పనులను చేపట్టాలని అన్నారు. సాస్కి పథకంలో కోటగుళ్లు, గణపసముద్రం చెరువును చేర్చినట్లు చెప్పారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కోటగుళ్ల ప్రాథమిక మరమ్మతు పనులతో పాటు గణపసముద్రం చెరువు కట్టపై నిర్మించే రోడ్డు, కాటేజీలు, చెరువులో బోటింగ్‌తో పాటు సాస్కి పథకంలో చేసే పలు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను 2026 మార్చి మాసాంతం వరకు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెరిటేజ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లక్ష్మీ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పర్యాటక అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ప్రాజెక్టు కన్సల్టెంట్స్ సత్యనారాయణ మూర్తి, కేంద్ర పురావాస్తు శాఖ అధికారులు డాక్టర్ హెచ్‌ఆర్ దేశాయ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఎం.నవీన్ కుమార్ పాల్గొన్నారు.
ఈ నెల చివరిలోగా టెండర్ల ప్రక్రియ
రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్
Comments
Please login to add a commentAdd a comment