మాది చేతల ప్రభుత్వం
జయశంకర్ భూపాలపల్లి
మంగళవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2025
పురుషులకన్నా మహిళలే అధికం
7
జిల్లాల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల వివరాలు...
భూపాలపల్లి
ములుగు
హనుమకొండ
వరంగల్
జనగామ
మహబూబాబాద్
సాక్షి ప్రతినిధి, వరంగల్ :
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 30,43,540లకు చేరింది. పురుషులు, మహిళలు, ఇతరులు, సర్వీసు ఓటర్లు కలిపితే 30.44 లక్షలకు చేరగా.. సోమవారం ప్రకటించిన తుది జాబితాలో ఈసారీ మహిళలదే అగ్రస్థానం. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళ ఓటర్లు 15,51,289 ఉన్నారు. ఇతరులు (థర్డ్‌జండర్) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2141. కొత్తగా నమోదైన మహిళ ఓటర్లు.. పురుషులతో పోలిస్తే 61,683 మంది ఎక్కువగా ఉన్నారు.
కూడికలు.. తీసివేతలు..
ఎన్నికల సంఘం ఏటా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కింద మార్పులు, చేర్పులతో ఓటరు జాబితాను తయారు చేస్తూ ఉంటుంది. కిందటేడాది అక్టోబరు 29న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. సవరణలు, మార్పులు, చేర్పులకు కిందటి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాల అనంతరం సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాల పరిధిలో 9,241 ఓటర్లను తొలగించి, కొత్తగా 11,882 మంది ఓటర్లను చేర్చుకున్నట్లు ఈ జాబితాలో వెల్లడించారు. ఇదిలా వుండగా గతేడాదితో పోలిస్తే 62,190 మంది ఓటర్లు పెరగగా.. అక్టోబర్ 29న ప్రకటించిన ముసాయిదా, తుది ఓటర్ల జాబితాకు 10,782 మంది పెరిగారు. రెండు నెలల వ్యవధిలో 10,782 మంది కొత్త ఓటర్లు తమ ఓటుహక్కును నమోదు చేసుకోవడం విస్తృత ప్రచారమే కారణమని ఎన్నికల సంఘం ప్రకటించింది.
వరంగల్‌లో 7,72,824 మంది ఓటర్లు
వరంగల్: వరంగల్ జిల్లా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరంగల్ జిల్లాలో మొత్తం 7,72,824 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్పెషల్ సమ్మరి రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్) ఫైనల్ సీడీలను అందించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి తుది ఓటరు జాబితా విడుదల తీరుపై ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ అయేషా మశ్రాత్ ఖానం వర్చువల్‌గా వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల ఈఆర్వోలతో సమీక్షించారు.
ఇతరులు
సర్వీస్ ఓటర్లు
మహిళలు
పోలింగ్‌స్టేషన్లు
పురుషులు
హనుమకొండ జిల్లాలో ఓటరు నమోదు తుది జాబితాలో మొత్తం 5,07,256 మంది ఓటర్లుగా నమోదయ్యారు. జిల్లాలోని రెండుని యోజకవర్గాల్లో 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో తుది ఓటరు ముసాయిదా జాబితాలో 5,07,256 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 2,47,920 మంది పురుషులు, 2,59,318 మంది మహిళ ఓటర్లతో పాటు 18 మంది ఇతర ఓటర్లుగా నమోదయ్యారని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
హనుమకొండ
జిల్లాలో
5,07,256
మంది..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మార్పులు, చేర్పుల అనంతరం
ఎన్నికల సంఘం వెల్లడించిన తుది జాబితా వివరాలు ఇలా..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
కొత్తగా చేరిన, తొలగించిన ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు సర్వీస్ మొత్తం
వరంగల్ పశ్చిమ 1,40,100 1,45,061 16 74 2,85,251
వరంగల్ తూర్పు 1,26,066 1,33,338 341 90 2,59,835
వర్ధన్నపేట 1,35,061 1,40,664 18 184 2,75,927
భూపాలపల్లి 1,36,952 1,41,022 08 203 2,78,185
ములుగు 1,14,504 1,20,730 26 226 2,35,486
జనగామ 1,20,891 1,25,069 10 136 2,46,106
స్టేషన్‌ఘన్‌పూర్ 1,26,630 1,30,723 04 173 2,57,530
పాలకుర్తి 1,27,758 1,30,543 14 155 2,58,470
డోర్నకల్ 1,10,016 1,14,627 07 183 2,24,833
మహబూబాబాద్ 1,27,527 1,33,088 47 197 2,60,859
నర్సంపేట 1,15,838 1,21,487 11 355 2,37,691
పరకాల 1,08,263 1,14,937 02 165 2,23,367
నియోజకవర్గం చేరినవి తొలగించినవి
వరంగల్ పశ్చిమ 1,059 381
వరంగల్ తూర్పు 1,040 430
వర్ధన్నపేట 1,328 777
భూపాలపల్లి 1,378 831
ములుగు 1,488 852
జనగామ 1,403 277
స్టేషన్‌ఘన్‌పూర్ 1,865 396
పాలకుర్తి 1,509 444
డోర్నకల్ 1,406 1,001
మహబూబాబాద్ 2,786 2,201
నర్సంపేట 1,409 885
పరకాల 1,211 766
న్యూస్‌రీల్
మార్పులు, చేర్పుల అనంతరం
తుది జాబితా విడుదల చేసిన
రాష్ట్ర ఎన్నికల సంఘం
12 నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లు
తొలగించినవి 9,241.. చేర్చినవి 17,882
Comments
Please login to add a commentAdd a comment