వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ చర్యలు
భూపాలపల్లి: చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. బాల కార్మికుల విముక్తి కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికా రులతో ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర తీ ఒక్కరు అంకితభావంతో పనిచేసి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలన్నారు. చిన్న, చిన్న విషయాలకే క్షణికావేశంలో కొందరు పిల్లలు తల్లిదండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని అన్నా రు. ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో పనులు చేయిస్తూ జీవి తాలతో ఆడుకుంటున్నారని అన్నారు. చిన్న పిల్లలతో పనులు చేపిస్తున్న వారిని గుర్తించి క్రిమి నల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తప్పిపోయిన పిల్లలను వెతికి ’దర్పణ్ ’ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలన్నారు. 1098, 112 నంబర్లపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఇన్‌చార్జ్ డీఈఓ లక్ష్మణ్, డీసీపీఓ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..
ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కిరణ్ ఖరే పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన 16మంది ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. సివిల్ పంచాయితీలు కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు.
మరింత ఉత్సాహంతో పని చేయాలి..
నూతన సంవత్సరంలో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది తదితరులతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బోనాల కిషన్, వేముల శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్‌రావు, రామ్మోహన్‌రెడ్డి, నారాయణనాయక్ పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment