ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో ధీమా..
నా భార్య రోజువారీ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. నేను టైలరింగ్ పనిచేస్తా. గత ప్రభుత్వాలు భూమి ఉన్న వారికే రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాలు వర్తింపజేశాయి. మాలాంటి భూమి లేని నిరుపేదలకు ఎలాంటి సహాయమూ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయడం హర్షణీయం.
– సూరం రమేష్, పీచర, వేలేరు మండలం
అర్హులకు రేషన్ కార్డులు
అందజేయాలి
అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రేషన్ కార్డులు అందించాలి. ప్రభుత్వం అందించే రుణమాఫీ లాంటి పథకాలు అందాలంటే రేషన్ కార్డు ప్రాధాన్యం కావడంతో చాలా మందికి రుణమాఫీ కాలేదు. ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునే వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయాలి.
– బంక శ్రీనివాస్, వేలేరు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక..
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం గ్రామసభలు జవాబుదారీతనంగా నిర్వహించేలా అధికారులు, సిబ్బందికి సూచించాం. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆదాయ వివరాలను సేకరించి అర్హులైన రేషన్ కార్డుల జాబితాలు గ్రామసభలో ప్రజలకు నివేదిస్తాం. గ్రామ సభలకు ఒకరోజు ముందే ప్రజలనుంచి వచ్చిన అభ్యంతరాలను సేకరిస్తాం.
– పి.ప్రావీణ్య, కలెక్టర్, హనుమకొండ
●
Comments
Please login to add a commentAdd a comment