బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా ఎన్.రవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆర్డీఓ మంగీలాల్ హనుమకొండకు బదిలీ కాగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆర్డీఓ రవిని భూపాలపల్లికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
కోటంచలో ప్రత్యేక పూజలు
రేగొండ: మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భూపాలపల్లి ఆర్డీఓ రవి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు బుచ్చమాచార్యులు స్వామి వారి శేషవస్త్రంతో ఆయనను సన్మానించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, సీనియర్ అసిస్టెంట్ స్పందన ఉన్నారు.
‘న్యాయ కళాశాల కోసం ఉద్యమిస్తాం’
వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమిస్తామని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ ఆదివాసీ యువతకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఆదివాసీ యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం ఆనంద్, శంకర్ పాల్గొన్నారు.
అసత్య ప్రచారం నమ్మి మోసపోవద్దు
ములుగు: ప్రభుత్వం కొత్త మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయబోతుందని అందుకు మీసేవ వెబ్‌సైట్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మీసేవ సెంటర్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతూ మోసగాళ్లు నకిలీ మీసేవ పోర్టల్‌ను కూడా రూపొందించారని వెల్లడించారు. ఆ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌కి ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని, డబ్బులు చెల్లింపులు చేసి మోసపోవద్దని తెలిపారు.
నాటుసారా తయారీపై
ఉక్కుపాదం
ములుగు: జిల్లాలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపేందుకు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ఎకై ్సజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొహిబిషన్ డైరెక్టర్ ఆదేశాలతో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి వి.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నాటుసారాయి తయారీ కేంద్రాలను, తయారీదారులను గుర్తిస్తామని తెలిపారు. గుడుంబా తయారీ ముడి సరుకులు అమ్మేవాళ్లను గుర్తించి అరె స్టు చేసి కేసులు నమోదు చేస్తామని వివరించారు. బైండోవర్ చేసి, బైండోవర్ నిబంధనల ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. లేదా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇంకనూ పద్ధతి మార్చుకోని వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖల భాగస్వామ్యంతో జిల్లాలో నాటు సారాను పూర్తిగా రూపుమాపేందుకు ఎకై ్సజ్ శాఖ కృతనిశ్చయంతో ముందుకెళ్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment