అర్హులను ఎంపిక చేయాలి
గణపురం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డుల జారీ వంటి పథకాలకు అధికారులు అర్హులైన అబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుందూరుపల్లిలో జరుగుతున్న రైతు భరోసా ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాకు సాగులో ఉన్న భూముల వివరాల నమోదుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలో పాల్గొంటారని తెలిపారు. గణపురం మండలంలో 691 మంది నూతన రేషన్ కార్డుల కోసం సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసుకున్నారని తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, ఏఈఓ కల్యాణ్, ఆర్‌ఐ రహ్మద్ పాషా, సర్వేయర్ నిరంజన్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment